Surprise Me!

TDP MP as 'Farmer' protest against Central Government

2018-03-07 86 Dailymotion

TDP MP Siva Prasad on Wednesday, turned as ‘Farmer’ to stage protest against Central Government on Special Status for AP issue. He reached parliament along with a Kavadi which contains sand on oneside and water on the other. <br /> <br /> <br />ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో కేంద్రం వైఖరిని నిరసిస్తూ పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలు చేస్తోన్న ఆందోళన మూడోరోజూ కొనసాగుతోంది. రోజుకో వేషధారణలో పార్లమెంట‌్‌కు వస్తూ వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తోన్న చిత్తూరు ఎంపీ శివప్రసాద్ బుధవారం రైతు వేషంలో వచ్చారు. ఇతర రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలు రైతు వేషంలో ఉన్న శివప్రసాద్‌ను పలకరించగా, ఆయన 'మోడీగారు ఎక్కడుంటారండీ..' అని అచ్చం అమాయక రైతులా తన నిరసన తెలిపారు. అంతేకాదు, శివప్రసాద్.. ఒక కుండలో మట్టి, మరో కుండలో నీరు ఉన్న కావడి భుజాన వేసుకుని వచ్చారు. అదేమని అడిగితే, తమ రాజధాని అమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ తమకు మట్టి, నీరు ఇచ్చారని.. ఇప్పుడు వాటిని ఆయనకే తిరిగి ఇచ్చేస్తామని వ్యాఖ్యానించారు. 'నాలుగేళ్ల క్రితం అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడు.. వేల కోట్ల రూపాయల సహాయం ప్రకటిస్తారేమోనని ఆశపడ్డామని, కానీ ఆయన మట్టి, నీరు ఇచ్చి చేతులు దులిపేసుకున్నారని..' శివప్రసాద్ చెప్పారు. <br />

Buy Now on CodeCanyon