Let’s all make narendramodi Ji a MAN by reminding his promise to Andhra Pradesh. Tweeted Koratala Siva
వరుస విజయాలతో కొరటాల శివ టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ గా మారాడు. మూస పద్ధతోలో కాకూండా కమర్షియల్ చిత్రాలకు సోషల్ మెసేజ్ జోడిస్తూ విజయాలు అందుకుంటున్నాడు. కొరటాల శివ అద్భుత విజయాలతో దూసుకుని పోతున్నారు. దర్శకుడిగా కొరటాల తెరకెక్కించిన మూడు చిత్రాలు మిర్చి, శ్రీమంతుడు మరియు జనతా గ్యారేజ్ ఘనవిజయాలుగా నిలిచాయి.

కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజగా చిత్రం భరత్ అనే నేను. ఇటీవల భరత్ అనే నేను టీజర్ విడుదలై సునామి సృష్టిస్తోంది. టీజర్ లోని డైలాగ్ ని ఉపయోగిస్తూ తాజాగా కొరటాల శివ ప్రధాని నరేంద్ర మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసారు.

ఇటీవల భరత్ అనే నేను టీజర్ విడుదలయింది. రికార్డు వ్యూస్ లో ఈటీజర్ యూట్యూబ్ లో సునామి సృష్టిస్తోంది. ప్రామిస్ చేసి మాట నిలనేట్టుకోలేనివాడు మనిషి కాదు అంటూ మహేష్ పలుకుతున్న డైలాగులకు అద్భుతమైన స్పందన వస్తోంది. కొరటాల తన చిత్రాలని కమర్షియల్ హంగులతో రూపొందించినా అంతర్లీనంగా సామజిక సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత.