As per the new structure, players from the men's cricket team have been divided into four categories – Grade A+, Grade A, Grade B and Grade C. MS Dhoni astonishingly is not part of the top bracket as he is in the Group A

బీసీసీఐ భారత క్రికెటర్ల జీతలు భారీగా పెంచింది. భారత క్రికెట్ కొత్త కాంట్రాక్టు వ్వవస్థను బీసీసీఐ బుధవారం ప్రకటించింది. తాజా కాంట్రాక్టు ప్రకారం క్రికెటర్లు గతంలో సంపాదించేదాని కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇప్పుడు సంపాదిస్తున్నారు.

భారత క్రికెటర్లకు అత్యుత్తమ జీతాలు ఉండాలన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు నియమించిన పాలకుల కమిటీ ఆటగాళ్ల జీతాలను భారీగా పెంచిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. ఈ సందర్భంగా అక్టోబర్ 2017 నుంచి సెప్టెంబర్ 2018 కాలానికిగాను బీసీసీఐ కొత్త కాంట్రాక్టులను ప్రకటించింది.

ఇప్పటివరకు టాప్ గ్రేడ్‌లో ఉన్న ధోనిని సెలక్టర్లు తప్పించారు. ప్రస్తుతం గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న పేసర్ మహ్మద్ షమిని మొత్తం కాంట్రాక్ట్‌లో నుంచే తొలగించింది. కొత్త కాంట్రాక్టులో రెండు కేటగిరీలను చేర్చింది. సీనియర్ పురుషుల జట్టులో A+ కేటగిరీని చేర్చగా... సీనియర్ మహిళల కోసం C కేటగిరీని చేర్చింది.