Surprise Me!

US Steel and Aluminum Tariffs : Who Expect to be Excluded ?

2018-03-10 113 Dailymotion

The European Union Trade Commissioner, Cecilia Malmstrom stated that Europe expects to be excluded from the United States steel and aluminium tariffs <br />అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన మనస్సుకు తోచిందే చేస్తున్నారు. హెచ్ 1 బీ వీసా విషయమైనా.. ముస్లిం దేశాల పౌరుల రాకపైనా.. ఏ విషయంలోనైనా తాను 'ఫస్ట్ అమెరికన్' నినాదానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అదే బాటలో మరో అడుగు ముందుకు వేశారు. ఇటీవల ఇనుము దిగుమతిపై 25 శాతం, అల్యూమినియం దిగుమతిపై 10 శాతం విధిస్తామని సోషల్ మీడియా వేదికగా ట్రంప్ ప్రకటన చేశారు. ట్రంప్ అన్నంత పని చేశారు. అధికారికంగా డిక్రీ చేశారు. అల్యూమినియం, ఉక్కు దిగుమతులపై 25%, 10% చొప్పున సుంకం విధించే ఆదేశాలపై సంతకాలు చేయడానికి ముందు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమ వస్తువులపై భారత్‌, చైనా ఎంత దిగుమతి సుంకం విధిస్తున్నాయో అంతే సుంకాన్ని వాటికి కూడా వర్తింపజేస్తామని హెచ్చరించారు. <br /> <br />అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోనే దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమైంది. కొని వర్గాలు అమెరికాకు ప్రయోజనకరమైన చరిత్రాత్మక నిర్ణయంగా అభివర్ణించగా మరికొన్ని వర్గాలు ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుందని, వాణిజ్య యుద్ధాలకు దారి తీస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. <br />

Buy Now on CodeCanyon