Surprise Me!

Nirav Modi and a prominent automobile dealer నీరవ్ మోడీకి గుంటూరుకు ఏంటి లింక్ ???

2018-03-10 436 Dailymotion

CBI is learnt to be looking at links between Nirav Modi and a prominent automobile dealer and trader in Guntur.
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పిఎన్‌బి) కుంభకోణం కేసులో ప్రధాన సూత్రధారి నీరవ్ మోడీతో గుంటూరుకు చెందిన ఓ వ్యాపారికి సంబంధాలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతోంది. ఈ సంబంధాలపై సిబిఐ ఆరా తీస్తున్నట్లు సమాచారం.

గుంటూరుకు చెందిన ఆటోమొబైల్ డీలర్, ట్రేడర్ నీరవ్ మోడీతో సంబంధాలు పెట్టుకున్నారని, ఆ ట్రేడర్‌కు రాజకీయ నేతలతో కూడా సంబంధాలున్నాయని అంటున్నారు

నీరవ్ మోడీతో సంబంధాలపై గుంటూరుకు చెందిన వ్యాపారిని సిబిఐ త్వరలో ప్రశ్నించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆయన పేరును వెల్లడించడానికి ఎవరూ సిద్ధపడడం లేదు. దాంతో ఆ వ్యాపారి ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొని ఉంది. సోషల్ మీడియా అతని లింకులపై కొన్ని పోస్టులు మాత్రం కనిపిస్తున్నాయి. అవి ఎంత వరకు నిజమనేది తెలియదు.

గుంటూరు ట్రేడర్ కార్యకలాపాలపై, అతని రాజకీయ సంబంధాలపై సిబిఐ ప్రాథమిక వివరాలను సేకరించే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి సిబిఐ ఇతర దర్యాప్తు సంస్థ సాయం కోరినట్లు తెలుస్తోంది. ఆ ఆటోమొబైల్ ట్రేడర్‌‌కు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఖాతాల వివరాలను ఇవ్వాలని సిబిఐ గుంటూరు ప్రాంతంలోని బ్యాంకర్లను కోరినట్లు తెలుస్తోంది.

Buy Now on CodeCanyon