Kajal Aggarwal Speaking about her personal life, Kajal said as of now, she is not thinking about her “Mr. Right”. On whether her Mr.Right will be from within the film industry or outside of it, Kajal said, “I haven’t thought about it; it’s not like I have a very narrow mindset about these things. The person is more important than the industry he belongs to”.

ఈతరం హీరోయిన్లలో 50 చిత్రాలు పూర్తి చేసిన ముద్దుగుమ్మగా కాజల్ అగర్వాల్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నది. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ చిత్రాలతో ప్రస్తుతం కాజల్ దూసుకెళ్తున్నారు.
చిన్నతనంలో సినిమా చూడటం అంటే ఓ పిక్‌నిక్ మాదిరిగా ఉండేది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళేవాళ్లం. సినిమా చూడటంతో పాటు సమోసాలు తినడం, కూల్ డ్రింకులు తాగడం లాంటి చేస్తూ బాగా ఎంజాయ్ చేసే వాళ్లం అని కాజల్ అగర్వాల్ అన్నారు.
ఇప్పుడు పట్టణాలలో మల్టీప్లెక్స్ సంస్కృతి పెరిగిపోవడంతో ఫ్యామిలీ ఆడియెన్స్ రాక పెరిగిపోయింది. వినోదంతోపాటు పిల్లలకు, పెద్దలకు కాలక్షేపంగా ఉంటున్నది. ఇప్పటి పిల్లలు కూడా నాలాగే సినిమాను ఎంజాయ్ చేస్తున్నారనే పరిస్థితిని నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నాను అని ఆమె అన్నారు.
ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. నాకు ఫలానా భాషలో నటించాలనే పరిమితులు లేవు. హాలీవుడ్ గానీ, విదేశీ చిత్రాల్లో నటించే అవకాశం వస్తే నటించడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. నాకు భాష అన్నది ఎప్పుడూ అవరోధం కాలేదు అని కాజల్ చెప్పారు.
యాక్టింగ్‌కు స్కోప్ ఉంటే ఏ భాషా చిత్రమైనా నేను నటించడానికి సిద్ధంగా ఉంటాను. అప్పుడు అది ప్రాంతీయ చిత్రమా? బాలీవుడ్ చిత్రమా? విదేశీ చిత్రమా అని నేను చూడను అని కాజల్ వెల్లడించారు.
పెళ్లి, కాబోయే భర్త గురించి కాజల్ తన అభిప్రాయాలను పంచుకొన్నారు. ప్రస్తుతం జీవిత భాగస్వామి గురించి ఆలోచించడం లేదు. సినిమాలతోనే జీవితం సరిపోతున్నది. ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు అని కాజల్ అన్నారు.