Surprise Me!

India vs Bangladesh : Rohit Sharma's Batting Order May Change

2018-03-14 178 Dailymotion

Rohit Sharma needs to maintain the consistency in the upcoming tours overseas. <br /> <br />దక్షిణాఫ్రికా పర్యటన మొదలుకొని ఒక్క మ్యాచ్ మినహాయించి ఏ మ్యాచ్‌లోనూ రాణించలేకపోతున్న రోహిత్‌పై బీసీసీఐ కొత్త నిర్ణయం తీసుకుంది. ఓపెనర్‌గా ఉన్న భారత తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మను బ్యాటింగ్ ఆర్డర్ మారమని కోరిందట. కొలంబో వేదికగా జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లోనూ ఘెరంగా విఫలమవుతున్నాడు రోహిత్ . ఇప్పటికే ముగిసిన మూడు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ శర్మ చేసిన పరుగులు 0, 17, 11 మాత్రమే. దీంతో.. టీమిండియా మేనేజ్‌మెంట్ సూచన మేరకు ఓపెనర్ స్థానం నుంచి మిడిలార్డర్‌‌లోకి మారాలని రోహిత్ శర్మ భావిస్తున్నాడట. బుధవారం రాత్రి 7 గంటలకి భారత్, బంగ్లాదేశ్ మధ్య టోర్నీలో భాగంగా ఐదో మ్యాచ్ జరగనుంది. <br />కెరీర్‌ ఆరంభంలో మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మను అప్పటి టీమిండియా కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ ఓపెనర్‌గా పంపించి ప్రయోగం చేశాడు. అప్పట్లో ఈ బ్యాటింగ్ మార్పు మంచి ఫలితాలు ఇవ్వడంతో.. వన్డే, టీ20ల్లో రోహిత్ శర్మ ఓపెనర్‌గా జట్టులో సెటిలైపోయాడు. <br />ఇటీవల ఆడుతున్న పేలవ ప్రదర్శన చూసి కేఎల్ రాహుల్‌ని ఓపెనర్‌గా పంపే యోచనలో ఉంది టీమిండియా. నాలుగో స్థానంలో రోహిత్ శర్మని బ్యాటింగ్‌ చేయించాలని టీమిండియా మేనేజ్‌మెంట్ యోచిస్తోంది.

Buy Now on CodeCanyon