Rohit Sharma on his way to the record with the fifth six of his innings against Bangladesh, Yuvraj Singh’s tally of 74. Others players featuring on the list are – Suresh Raina (54 sixes), MS Dhoni (46) and Virat Kohli (41). <br /> <br />పేలవ ప్రదర్శన అని విమర్శిస్తున్న తరుణంలో రోహిత్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి అందరి నోళ్లు మూయించాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం విరాట్ కోహ్లీ విరామంలో ఉండగా తాత్కాలికంగా కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న రోహిత్ ఈ ముక్కోణపు టోర్నీ తొలి మ్యాచ్ నుంచి ఆశించినంత ప్రదర్శన చేయలేకపోయాడు. దీంతో అతని స్థానం మిడిలార్డర్‌కు మార్చే ఆలోచనలో పడ్డాయి మేనేజ్‌మెంట్ వర్గాలు. <br />కొలంబో వేదికగా జరుగుతున్న టీ20 ట్రైసిరీస్ లీగ్ మ్యాచ్‌లో భాగంగా బుధవారం బంగ్లాతో భారత జట్టు తలపడింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన రోహిత్ 61 బంతుల్లో 5ఫోర్లు, 5సిక్సర్లతో 89 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో విజృంభించిన రోహిత్ తన కెరీర్‌లో మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు (74) బాదిన భారత బ్యాట్స్‌మన్‌గా సీనియర్ ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉన్న రికార్డును రోహిత్ బద్దలు కొట్టాడు. <br />బుధవారం టీ20లో 5 సిక్సులు కొట్టడంతో రోహిత్ ఖాతాలో సిక్సర్ల సంఖ్య 75 చేరింది. ఇక టీమిండియా తరఫున సురేశ్ రైనా(54), మహేంద్రసింగ్ ధోనీ(46), విరాట్ కోహ్లీ 41 సిక్సుల తో అత్యధిక సిక్సులు బాదిన వారిలో తరువాతి స్థానాల్లో ఉన్నారు.