The support from the various political parties to TDP in regard of it's No Confidence Motion against Central Government is gradually growing. On this issue, already Congress, Left Parties, AIADMK, TMC announced their support. Only Akalidal is not willing to support TDP on this No Confidence Motion.

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ సొంతంగా ప్రవేశపెట్టబోతున్న అవిశ్వాస తీర్మానానికి వివిధ పార్టీల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్, ఏఐఏడీఎంకే, వామపక్షాలు, ఎంఐఎం, శివసేన, టీఆర్ఎస్‌లు టీడీపీకి తమ మద్దతు ప్రకటించాయి.
టీడీపీ నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ కూడా స్వాగతించారు. అవిశ్వాస తీర్మానానికి మద్దతు ప్రకటించారు. ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి రావాలని ఆమె పిలుపునిచ్చారు.
ఏఐఏడీఎంకేకి లోక్‌సభలో 37 మంది సభ్యులు ఉన్నారు. కాంగ్రెస్‌కు 48 మంది సభ్యులు ఉన్నారు. అయితే టీడీపీ ప్రవేశపెట్టబోయే అవిశ్వాస తీర్మానికి మద్దతు ప్రకటించే విషయంలో అకాలీదళ్ ఒక్కటే విభేదించింది. ఈ విషయంలో టీడీపీకి తమ పార్టీ మద్దతు ఇవ్వలేదని ఆ పార్టీ తేల్చి చెప్పింది. అవిశ్వాసంపై తాము దూరంగా ఉండిపోతామని పేర్కొంది.
తాము ప్రతిపాదించే అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడుతామని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా కేంద్రంపై అవిశ్వాసం ప్రతిపాదించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అవిశ్వాస తీర్మానం ద్వారా కేంద్రానికి తగిన బుద్ధి చెప్తామని వారన్నారు. తోట నర్సింహ, సిఎం రమేష్ తదితరులు శుక్రవారం మీడియాతో మాట్లాడారు నోటీసుపై సోమవారానికి 54 మంది సభ్యుల సంతకాలు సేకరిస్తామని చెప్పారు.
తమ పార్టీపై కుట్ర జరుగుతోందని వారన్నారు. అందుకే ఎన్డీఎ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు ఎపి హక్కుల కోసం పోరాటం చేస్తామని అన్నారు. కాగా, తమ పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాసానికి మద్దతు ఇవ్వకూడదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంపీ విజయసాయ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాలపై చంద్రబాబుకు చిత్తశశుద్ది లేదని ఆయన అన్నారు.