Surprise Me!

పూనమ్ కౌర్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌ చేసిందేంటి ?

2018-03-19 671 Dailymotion

Actress Poonam Kaur made sensational comments in her facebook account. She made comments on present day politics. In this occassion, Kathi Mahesh and Poonam Kaur come to a event as guest. But Poonam went middle of the meeting when she sees Kathi Mahesh.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌ను టార్గెట్‌గా చేసుకొని క్రిటిక్ కత్తి మహేష్ మాటల దాడులు చేయడమనేది మీడియాలో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ వివాదం పవన్ ఫ్యాన్స్, మహేష్ కత్తి మధ్య రచ్చరచ్చగా మారడం, దాడులకు దారి తీసాయి. ఈ వివాదంలోకి అనూహ్యంగా పూనమ్ కౌర్ దూసుకొచ్చింది. పవన్‌కు మద్దతుగా కత్తి మహేష్‌పై పూనమ్ పదునైన వ్యాఖ్యలు చేసింది. దాంతో పవన్, పూనమ్ మధ్య ఏదో సంబంధం ఉందని కత్తి ఆరోపణలను గుప్పించారు. దాంతొ పూనమ్, కత్తి మహేష్ ఆ మధ్య తీవ్ర వివాదం నెలకొన్నది.
కాగా, తాజాగా మార్చి 17న హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ సొసైటీలో ఓ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమానికి మహేష్ కత్తి, పూనమ్ కౌర్ తదితరులను ఆహ్వానించారు. కార్యక్రమానికి ఆరంభానికి ముందే మహేష్ కత్తి అక్కడి వచ్చి వేదికపైకి వెళ్లారు. ఈవెంట్ ప్రారంభమైన కొద్ది సేపటికి పూనమ్ కౌర్ వచ్చారు.
పూనమ్ కౌర్ వేదిక వద్దకు వెళ్లేసరికి ముందు మహేష్ కత్తి కనిపించాడు. దాంతో అక్కడ ఉన్నవారిని పలకరించకుండా వెంటనే పూనమ్ కౌర్ తిరుగుముఖం పట్టింది. వడివడిగా నడుచుకొంటూ వేదిక వద్ద నుంచి బయటకు వెళ్లిపోయింది. కత్తిని చూసి పూనమ్ వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.
ఈవెంట్‌కు ముందు రోజు పూనమ్ కౌర్ పరోక్షంగా రాజకీయ విమర్శలు చేశారు. కొందరు కాన్సెప్ట్, డైలాగ్స్ కాపీ చేసి బట్టలు మార్చుకొంటున్నారు. మనషులను మారుస్తూ, మాట మీద ఉండకుండా ఉంటున్నారు. అమాయక జనాలతో ఆడుకొంటున్నారు అని ఫేస్‌బుక్‌లో స్పందించారు.
వేష, భాషలను మారుస్తూ జనాలను మభ్య పెడుతున్నారు. అమ్మాయిలను అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి విషయాల్లో నిజం ఏంటో భగవంతుడే తెలియజెప్పాలి. అందుకోసం భగవంతుడ్ని మనస్పూర్తిగా కోరుకొంటున్నాను అని పూనమ్ ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యలు చేశారు.

Buy Now on CodeCanyon