Surprise Me!

సుకుమార్ కి ఇంత దైర్యం ఎలా వచ్చింది ?

2018-03-19 1,033 Dailymotion

Sukumar Emotional Speech about Chiranjeevi. Sukumar talks about Rangasthalam movie unit

ఉగాది పర్వదినాన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్మెకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రంగస్థలం చిత్ర యూనిట్ సమక్షంలో ప్రీరిలీజ్ ఈవెంట్ వైభవంగా జరగడం విశేషం.
తన అభిమాన నటుడు చిరంజీవి గారికి, పితృ సమానులైన అల్లు అరవింద్ గారికి నా ప్రణామాలు అంటూ సుకుమార్ తన ప్రసంగాన్ని మొదలు పెట్టడం విశేషం.
చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్న సమయంలో దేవిశ్రీ ప్రసాద్ తనతో అన్న మాటని గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవి కన్నా చిరంజీవి పదవే గొప్పది కదా.. ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారు అని దేవి తనతో అన్నట్లు సుకుమార్ తెలిపారు.
రంగస్థలం సినిమా చూసాక చిరంజీవి గారు తనని ఇంటికి పిలిచారని .. ఇచ్చిన ఫీడ్ బ్యాక్ మరచిపోలేనిదని సుకుమార్ అన్నారు.
రత్నవేలు ఈ చిత్రానికి అద్భుతమైన సినిమాటోగ్రఫీని అందించారని సుకుమార్ తెలిపారు
దేవిశ్రీ ప్రసాద్ కేవలం మూడున్నర రోజుల్లోనే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందించారని సుకుమార్ అన్నారు.
సమంతని ఎప్పుడు డైరెక్ట్ చేస్తూనే ఉండాలి అనిపించేంతగా ఈ చిత్రంలో నటించిందని .. రామలక్ష్మి పాత్రని అంగీకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మొదటి 5 రోజుల షూటింగ్ లో తాను ఆదితో మాట్లాడలేదు అని .. ఎందుకంటే ఆది కి సలహాలు ఇవ్వడానికి ఏమి లేదని ఆయన తన పాత్రలో అంతగా ఒదిగిపోయారని సుకుమార్ అన్నారు.
రాంచరణ్ తొలిసన్నివేశం నుంచే తన పాత్రలో ఒదిగిపోయాడని సుకుమార్ అన్నారు. రాంచరణ్ నటించిన తన తొలి సన్నివేశానికి సెట్స్ లో ఉన్నవారంతా చప్పట్లతో మారు మ్రోగించారని సుకుమార్ తెలిపారు.

Buy Now on CodeCanyon