Former MP Undavalli Arun Kumar responded on Cine Actor Sivaji comments on politics.

ఆపరేషన్ గరుడ, ఆపరేషన్ ద్రవిడ లాంటి వాటితో దక్షిణాదిపై ఓ జాతీయ పార్టీ కన్నేసిందని సినీ నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తనదైన శైలిలో స్పందించారు. ఇలాంటివి సినిమాల్లో మాత్రమే సాధ్యమవుతాయని అన్నారు.
రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు చేసి పొలిటికల్ ఆపరేషన్ చేస్తాయని అనుకోవడం అవివేకమే అవుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు.
ఆపరేషన్ గరుడకు రూ. 4800 కోట్లు కేటాయించారన్న శివాజీ వ్యాఖ్యలపై ఉండవల్లి స్పందిస్తూ.. ప్రజల ఓటింగ్‌ను బట్టే పార్టీలు గెలుస్తాయని, పార్టీల వ్యూహాలతో కాదని స్పష్టం చేశారు. పార్టీల వ్యూహాలు కేవలం ఓటింగ్‌ను ఆకర్షించడానికి మాత్రమే పనిచేస్తాయని తెలిపారు.
డబ్బుతోనే గెలుస్తామనుకుంటే.. టాటాలు, అంబానీలు వద్ద మన బడ్జెట్ అంత డబ్బుందని.. నిమిషాల్లో వారు గవర్నమెంటును మార్చేయగలరని చెప్పారు. అయితే, శివాజీ కథ చెప్పారని తాను అనడం లేదని, ఆయన కథే చెప్పాలనుకుంటే నిన్నే చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు.
ఎవరో కళ్యాణ్ జీ అనే వ్యక్తి చెబితే.. శివాజీ నమ్మి ఉంటారని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. రాష్ట్రాన్ని విభజించే సమయంలో లోకసభలో వెల్‌లో కనీసం 100మంది సభ్యులు ఆందోళన చేస్తున్నారని, ఆ ఆందోళనల్లో రాష్ట్రాన్ని విభజించారని ఉండవల్లి అన్నారు.
సభలో ఉన్న సభ్యులను లెక్కించడానికి అప్పుడు వీలైనప్పుడు.. ఇప్పుడెందుకు కాదని లోకసభ స్పీకర్‌ను ఉండవల్లి ప్రశ్నించారు.