Bharat Ane Nenu audio will be unveiled on April 7th in Vijayawada and the makers already acquired the necessary permissions for the same <br /> <br />మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'భరత్ అనే నేను'. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్ల జోరు పెంచారు. తొలి పాటను మార్చి 25న ఉదయం 10గంటలకు విడుదల చేయబోతున్నారు. <br />కాగా... ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్/ఆడియో వేడుక హైదరాబాద్‌లో కాకుండా ఏపీలో నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వైజాగ్ అనే వార్తలు వినిపించాయి. తాజాగా విజయవాడ పేరు తెరపైకి వచ్చింది. మరి ఎక్కడ నిర్వహిస్తారనే విషయమై నిర్మాతల నుండి ఓ క్లారిటీ రావాల్సి ఉంది. ఏప్రిల్ 7న ఈ వేడుక జరుగనుంది. <br />కాగా...సినిమాకు సంబంధించిన షూటింగ్ పార్టు మొత్తం పూర్తయింది. అయితే ఒక పాట మాత్రం బ్యాలెన్స్ ఉంది. మార్చి 26 నుంచి స్పెయిన్‌లో ఆ గీతాన్ని చిత్రీకరిస్తారని, చిత్ర యూనిట్ అక్కడి నుండి తిరిగి రాగానే వేడుక నిర్వహించనున్నారు.
