Surprise Me!

Shikhar Dhawan credits South African tour for his A+ contract

2018-03-24 102 Dailymotion

India opener Shikhar Dhawan said that his performance in the South African tour helped him secure an A+ contract under the BCCI’s new annual contracts category.

దక్షిణాఫ్రికా పర్యటనలో మెరుగైన ప్రదర్శన చేయడం వల్లనే తనకు 'ఎ+' కాంట్రాక్టు లభించిందని టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ వెల్లడించాడు. ఇటీవల బీసీసీఐ ప్రకటించిన వార్షిక వేతనాల కాంట్రాక్టులో శిఖర్ ధావన్‌కు 'ఎ+' గ్రేడ్ లభించిన సంగతి తెలిసిందే. దీనిపై ధావన్ తొలిసారిగా స్పందించాడు.
'విదేశీ పిచ్‌లపై పరుగులు చేయడంలో నేను కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవం. అయితే అదంతా గతం. దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే, టీ20 లో చక్కటి ప్రదర్శన చేశాను. ఎలాగైనా సరే రాణించాలన్న పట్టుదలే నన్నునడిపించింది. 'అని ధావన్ అన్నాడు.
'ఏదేమైనా అలా జరగడం ఎంతో గర్వంగా, సంతోషంగా ఉంది. త్వరలో జరుగనున్న ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ రాణిస్తానన్న నమ్మకం ఉంది. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని భారత క్రికెట్‌ జట్టు పటిష్టంగా ఉంది. సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతుల్యంగా ఉంది' అని ధావన్ తెలిపాడు.
'ఇంగ్లాండ్‌తో సిరీస్‌ చాలా కఠినంగా ఉంటుంది. ఐతే అక్కడి పిచ్‌లపై ముందు నుంచే ఆడి అలవాటు పడితే ఎలా ఉంటుందో చూడాలి. సరైన సన్నద్ధత ఉండి, మేం మా అత్యుత్తమ ప్రదర్శన చేయగలిగితే ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్‌ గెలవకపోవడానికి కారణాలేమీ కనిపించవు' అని ధావన్‌ అన్నాడు.
ప్రస్తుతం తన దృష్టంతా మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌పైనే ఉందని అన్నాడు. ఐపీఎల్‌లో ధావన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరుపున ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Buy Now on CodeCanyon