Nandamuri Tejeswini, Balakrishna's second daughter has been blessed with a baby boy. Tejeswini and Sri Bharath, the couple, are on cloud nine. Both mother and new born are healthy and happy.

బాలకృష్ణ అభిమానులకు హ్యాపీ న్యూస్. బాలయ్య మరోసారి తాతయ్య అయ్యారు. ఆయన రెండో కూతురు తేజస్విని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ శుభవార్తతో బాలయ్య ఫ్యామిలీ ఆనందంలో మునిగితేలుతోంది.
తేజస్విని వివాహం గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు ఎంవివిఎస్ మూర్తి మనవుడు శ్రీభరత్‌తో 2013లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో బాలయ్య ఈ పెళ్లివేడుకను రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులను ఆహ్వానించి గ్రాండ్‌గా నిర్వహించారు.
ఇక బాలయ్య పెద్దకూతురు బ్రాహ్మణి వివాహం... ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌తో జరిగిన సంగతి తెలిసిందే. వీరికి దేవాన్షన్ అనే కుమారుడు ఉన్నాడు. దేవాన్ష్ 3వ పుట్టినరోజు వేడుక మూడు రోజుల క్రితమే జరిగింది.
తనకు మరో మనవడు పుట్టిన విషయం తెలియడంతో బాలయ్య ఆనందంలో మునిగిపోయారని, తన సన్నిహితులకు, సిబ్బందికి స్వీట్లు పంచినట్లు సమాచారం. కుటుంబ సభ్యులంతా తేజ్వస్విని, బాబును చూసేందుకు వెళ్లారు.