Since the last few days, Salman Khan has been introducing us to his 'Race 3' family by dropping a new character poster each day as promised. And now, Salman has shared a brand new poster where he is seen posing with the entire 'Race 3' family. The tagline of the poster reads- 'You don't need enemies when you have a family'.

బాలీవుడ్లో రూపుదిద్దుకుంటున్న అతిపెద్ద ప్రాజెక్ట్ 'రేస్ 3'. సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్, బాబీ డియోల్, జాక్వెలిన్, డైసీ షా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం న్యూ పోస్టర్ తాజాగా విడుదల చేశారు. ఈ పోస్టర్ ద్వారా 'రేస్ 3' ఫ్యామిలీని పరిచయం చేశారు.
నీకు ఫ్యామిలీ ఉన్నపుడు శత్రువులు అవసరం లేదు అనే క్యాప్ తగిలించడం ద్వారా సినిమాపై మరింత ఆసక్తి రేకెత్తించారు. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సికిందర్ పాత్రలో కనిపించబోతున్నారు.
జెస్సికా పాత్రలో జాక్వెలిన్, సిజ్లింగ్ సంజన పాత్రలో డైసీ షా, యాంగ్రీ యంగ్ మ్యాన్ సూరజ్ పాత్రలో సాఖిబ్ సలీమ్, విలన్ పాత్రలో ఫ్రెడ్డీ దరువాలా, 'బాస్' శంషేర్ పాత్రలో అనిల్ కపూర్ ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు.
రేస్ 3' పోస్టర్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసిన సల్మాన్ ఖాన్ రేసు మొదలైంది. ఇదే మా రేస్ 3 ఫ్యామిలీ. ఈద్ నాటికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అని తెలిపారు.
ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ కోసం జాక్వెలిన్, డైసీ షా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకున్నారట. వీరి మధ్య జరిగే ఫైట్ సన్నివేశాలు అబుదాబిలో చిత్రీకరించాని సమాచారం. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ సీన్ల చిత్రీకరణ కూడా అక్కడే జరుగుతోంది.
ఈ చిత్రానికి సంబంధించిన ఇతర పాత్రల పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు.