Surprise Me!

MS Dhoni Met One Of His Youngest Fan, Video Goes Crazy

2018-03-26 83 Dailymotion

In a video , Dhoni is seen taking a break from the nets and interacting with a young boy as his family looks on with immense joy at being able to meet the great man

ఐపీఎల్ వాతావరణం అంతటా వ్యాపించింది. ఇప్పటికే పలు జట్లు ప్రాక్టీసు క్యాంపులంటూ పూర్తిగా సిద్ధమైపోయాయి. మిస్టర్ కూల్ సారథ్యంలో ఆడేందుకు చెన్నై సూపర్ కింగ్స్ మైదానంలో ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టేసింది. రెండేళ్ల అనంతరం ఐపీఎల్ లో మళ్లీ అడుగుపెట్టబోతున్న చెన్నై జట్టు తీవ్రమైన ఉత్కంఠల మధ్య బరిలోకి దిగనుంది.
భారత మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ ధోనీ సీఎస్‌కే జట్టుకు తిరిగి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో చెన్నై జట్టుకు మిగిలిన జట్ల కంటే ఎక్కువ ప్రాముఖ్యత చోటు చేసుకుంది. ధోనీ కూడా గత వారమే జట్టులో చేరి నెట్‌లో ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. సాధనలో బిజీగా ఉన్నప్పటికీ అభిమానుల కోసం సమయాన్ని కేటాయించే ధోనీ.. తాజాగా ఆటకు కాస్త విరామం ఇచ్చి ఓ చిన్నారితో ముచ్చటించాడు.
మైదానానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఓ బాలుడితో కాసేపు సరదాగా గడిపాడు. బాలుడు చేతితో తన చేతిపై కొడుతుండగా ధోనీ తప్పించుకుంటూ సరదా సన్నివేశాన్ని సృష్టించాడు. ఇలా కాసేపు ఆడి చివరగా ఆ బాలుడు చేతిపై కొట్టగా.. 'అబ్బో బాగా దెబ్బ తగిలింది..' అంటూ ఎక్స్‌ప్రెషన్‌ ఇచ్చాడు. దాంతో ఆ పిల్లోడు మురిసిపోయాడు. సరదాగా సాగిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
ఏప్రిల్ 7వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ముంబై ఇండియన్స్ జట్టుకు జరిగే తొలి మ్యాచ్ తో ఐపీఎల్ పదకొండో సీజన్ ఆరంభం కానుంది. కాగా ఆరంభ వేడుకకు సైతం ఈ ఇరు జట్లు కెప్టెన్లే హాజరుకానున్నారు.

Buy Now on CodeCanyon