Baahubali’ franchise has surely made Prabhas a big name, not just down South, but he now has fan following all around the world. Recently, the actor had a meet and greet session with his fans and here is showed his soft side. Despite being such a big star, he is still down to earth and this act of his serves as a proof.

బాహుబలి సినిమా ద్వారా ప్రభాస్ స్టార్ ఇమేజ్ శిఖరాగ్రానికి చేరినా.... ఆయన దాన్ని తలకెక్కించుకోలేదు. తన అభిమానులను, స్నేహితులను ట్రీట్ చేసే విధానం ఏ మాత్రం మారలేదు. వారి కోసం ఆయన ఎంతకిందకి దిగడానికైనా సిద్ధంగా ఉంటానని మరోసారి నిరూపించారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటోల్లో ప్రభాస్ తన అభిమాని కోసం మోకాళ్లపై కూర్చుని కనిపించారు
శారీరక అంగవైకల్యం ఉన్న అభిమాని ఒకరు ప్రభాస్‌ను కలవడానికి వచ్చారు. అయితే తన వైకల్యం మూలంగా ప్రభాస్‌తో సెల్ఫీ దిగడానికి ఇబ్బంది పడ్డాడు. దీంతో అతడి కోసం ప్రభాస్ స్వయంగా మోకాళ్ల మీద కూర్చుని సెల్పీకి ఫోజులు ఇచ్చారు.
ప్రభాస్ ఇటీవల తన అభిమానులతో కలిసి మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను పలువురు అభిమానులు సోషల్ మీడియా ద్వారా పోస్టు చేశారు.
బాహుబలి 2' తర్వాత ప్రభాస్ ‘సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. దీని తర్వాత ‘జిల్' ఫేం రాధాకృష్ణ కుమార్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం.