Ram Charan’s Rangasthalam has crossed $1 Million mark in USA. Career best openings for Ram Charan

రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం బ్లాక్ బస్టర్ విజయం దిశగా దూసుకునిపోతోంది. రాంచరణ్ తన నటనతో మెస్మరైజ్ చేసాడని అభిమానుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. చిట్టిబాబుగా రాంచరణ్ పెర్ఫామెన్స్ వర్ణనాతీతమైనది. రంగస్థలం చిత్రం తొలిరోజు భారీ వసూళ్ళని సాధించినట్లు తెలుస్తోంది. యుఎస్ లో అయితే రంగస్థలం వసూళ్లు సునామి సృష్టిస్తున్నాయి. తొలిరోజే ఈ చిత్రం మిలియన్ డాలర్ మార్క్ ని అలవోకగా దాటేయడం విశేషం.
రంగస్థలం మానియా ప్రస్తుతం మెగా అభిమానులని ఊపేస్తోంది. రాంచరణ్ ఈ చిత్రంలో కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అందించడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
రంగస్థలం చిత్రం యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో వసూళ్లు ప్రవాహంలా వస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని ఏరియాల్లో ఈ చిత్రానికి రాంచరణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ నమోదలైనట్లు తెలుస్తోంది.
యూఎస్ ఆడియన్స్ రంగస్థలం చిత్రానికి బాగా కనెక్ట్ అయిపోయినట్లు ఉన్నారు. కేవలం ప్రీమియర్స్ తోనే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్స్ కొల్లగొట్టింది. తొలిరోజు ముగిసేసమయానికి అలవోకగా మిలియన్ మార్కు అందుకుంది. తొలి రోజు ఈ చిత్రం 1.2 మిలియన్ డాలర్స్ వసూలు చేయడం విశేషం. రెండవరోజు సులభంగా రెండు మిలియన్ల వసూళ్లు కొల్లగొడుతుందని అంచనా వేస్తున్నారు.
రంగస్థలం చిత్రానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రశంస లభించింది. పీకే క్రియేటివ్ వర్క్స్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పవన్ రాంచరణ్ ని, రంగస్థలం చిత్ర యూనిట్ ని ప్రశంసించాడు. రంగస్థలం చిత్రంలో రాంచరణ్ అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించాడని పీకే క్రియేటివ్ వర్క్స్ పేర్కొంది.