Surprise Me!

అవిశ్వాసంపై ఉత్కంఠ: ఈరోజైనా చర్చకు వస్తుందా!, జగన్ ప్రకటన సంచలనమే?

2018-04-02 1 Dailymotion

It's 9th time that YSRCP has given notice to move no confidence motion against Narendra Modi govt. But the speaker will accept it or not?

పార్లమెంటు మలివిడుత సమావేశాలు క్లైమాక్స్‌కు చేరుకున్న నేపథ్యంలో.. ఇప్పటికైనా కేంద్రం అవిశ్వాస తీర్మానంపై చర్చకు అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పార్లమెంటు సమావేశాలు ముగిసిపోతే.. కేంద్రాన్ని ప్రత్యక్షంగా నిలదీయడానికి మరో అవకాశం ఉండదు కాబట్టి.. సోమవారం లోక్‌సభ ఎజెండాలో అవిశ్వాసానికి చోటు ఉంటుందా.. ఉండదా? అన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోన్న విషయం.
కేంద్రంపై పోరును మరింత ఉధృతం చేసేందుకు సీఎం చంద్రబాబు ఈరోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. పలు పార్టీల అధినేతలు, అధినేత్రులతో మంతనాలు జరపనున్నారు. మరోసారి టీడీపీ అవిశ్వాసానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో.. దానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.
ఇక తొలి నుంచి హోదా కోసం గట్టిగా ఫైట్ చేస్తున్న వైసీపీ.. చివరి దశలో మరింత అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది. వైసీపీకి బీజేపీతో లింకులు అంటగడుతున్న నేపథ్యంలో.. దాన్ని ఎండగడుతూనే తమ పోరాటాన్ని కొనసాగించాలని భావిస్తోంది. తొమ్మిదోసారి అవిశ్వాసాన్ని ప్రతిపాదిస్తూ ఆ పార్టీ స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది.
హోదాపై మద్దతు విషయంలో ఆయా పార్టీల అధినేతలు, అధినేత్రులను సంప్రదిస్తున్న చంద్రబాబు.. వైఎస్ జగన్, విజయసాయిరెడ్డిల అవినీతి అంశాలను కూడా ప్రస్తావించాలనుకుంటున్నారట. ఆర్థిక నేరస్తులకు ప్రధాని ప్రాముఖ్యత ఇస్తున్నాడని వాళ్లతో చెబుతారట.

Buy Now on CodeCanyon