Surprise Me!

ప్రధానిని, ప్రధాని కార్యాలయం ప్రతిష్ఠను దెబ్బతీసేలా చంద్రబాబు మాట్లాడుతున్నారు

2018-04-03 1 Dailymotion

YSRCP Rajysabha member Vijayasai Reddy moves privilege notices to Rajyasabha chairman Venkaiah Naidu against Chandrababu Naidu for insulting PM Modi.

టీడీపీ-వైసీపీ మధ్య ఫైట్ అంటే.. వారి అనుకూల మీడియా మధ్య ఫైట్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఎవరి అనుకూల మీడియాలో వాళ్ల గొంతులు బలంగా వినిపించుకోవడం చాలాకాలంగా జరుగుతున్నదే. ప్రత్యర్థిని దెబ్బకొట్టడానికి ఈ రెండు పార్టీలు.. వాటిని బాగా ఉపయోగించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిపై టీడీపీ అనుకూల మీడియా ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది.
ప్రధాని నరేంద్ర మోడీతో తాను భేటీ అయితే.. ఆర్థిక నేరస్తులతో పీఎంకి పనేంటి? అని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రంగా పరిగణించారు. చంద్రబాబుపై రాజ్యసభ చైర్మన్‌కు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.టీడీపీ నేతలు అరుణ్ జైట్లీని కలిస్తే తప్పు లేదు కానీ.. తాను ప్రధానితో భేటీ అయితే తప్పేంటని విజయసాయి ప్రశ్నిస్తున్నారు
చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఇచ్చిన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు.. మోడీపై విధేయతను చాటుకోవడమే అని టీడీపీ అనుకూల మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది. ఒకవైపు మోడీ సర్కారుపై అవిశ్వాసానికి నోటీసులు ఇస్తూనే..మరోవైపు ఆయనకు దగ్గరవడానికి వైసీపీ ఆరాటపడుతున్నట్టుగా అందులో పేర్కొన్నారు. అంతేకాదు, ఎవరైనా తమ హక్కుల కోసం మాట్లాడుతారని, కానీ విజయసాయి మాత్రం మోడీ హక్కులకు భంగం కలిగినా ఊరుకునేది లేదని చెబుతున్నారని ప్రస్తావించారు. ఇదంతా మోడీకి దగ్గరయ్యే ప్రయత్నమే తప్ప మరొకటి కాదనే ఉద్దేశంఅని టీడీపీ అనుకూల మీడియా ఓ కథనాన్ని ప్రచురించింది .
ప్రధానిపై, తనపై సీఎం చంద్రబాబు అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. నాపై సీబీఐ, ఈడీ కేసులు ఉన్నందునా.. వాటి నుంచి బయటపడేందుకు ప్రధానితో సన్నిహిత సంబంధాల కోసం పాకులాడుతున్నానని చంద్రబాబు ఆరోపించడాన్ని తప్పు పట్టారు. ప్రధానిని కలిసి తర్వాతే కొన్ని కేసుల్లో పీఎంఎల్‌ఏ ట్రైబ్యునల్‌ అనుకూల తీర్పులు ఇచ్చిందని చెప్పడాన్ని ఆయన ఖండించారు.

Buy Now on CodeCanyon