Rangasthalam starring Ram Charan and Samantha Akkineni getting good buzz from all over the world. Samantha's Rama Laxmi role has earned a tremoundous positive talk.

రంగస్థలం చిత్రంలో రామలక్ష్మీ పాత్రలో సమంత అక్కినేని అదరగొట్టింది. సమంత నటనకు ప్రేక్షకులు నీరాజనం పడుతున్నారు. ప్రస్తుతం రంగస్థలం సక్సెస్ ఓ పక్క ఎంజాయ్ చేస్తూనే భర్త నాగచైతన్యంతో అమెరికాలో హాలీడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నది.
ఎనిమిదేళ్ల క్రితం ఏ మాయ చేసావే సినిమా షూటింగ్ సందర్భంగా నాగచైతన్య, సమంత ఇద్దరు అమెరికాలోని ఓ ప్రాంతంలో ప్రేమలోపడ్డారు. ఆ ప్రాంతంలోనే ఇప్పడు వారిద్దరూ సందడి చేస్తున్నారు. ఆనాటి జ్ఞాపకాలను చైతూ, సమంత నెమరువేసుకొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీ జీవితంలో ఎక్కువగా గుర్తు పెట్టుకొనే రోజు ఏమిటని ఓ అభిమాని అడుగగా నా పెళ్లి రోజు అని సమాధానం ఇచ్చింది.
మీరు అబ్బాయి అయితే ఏ హీరోయిన్‌తో ప్రేమలో పడేవారు అని ఓ అభిమాని అడిగిన తుంటరి ప్రశ్నకు సమంత సమాధానం ఇస్తూ.. దీపికా పదుకోన్ అని సమాధానం చెప్పారు. తనకు దీపికా పదుకోన్ అంటే చాలా ఇష్టమని పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే.
దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకు బాగా నచ్చిన హీరోయిన్ సాయి పల్లవి అని సమంత ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చింది. ప్రేమమ్, ఫిదా, ఎంసీఏ, కణం చిత్రాలతో సాయి పల్లవి విలక్షణ నటిగా పేరుతెచ్చుకొన్నారు. ఆమె నటనను నాకు బాగా నచ్చింది అని అభిమాని ప్రశ్నకు జవాబిచ్చింది.
రాంచరణ్‌తో తన కాంబినేషన్‌ను సరైన జోడిగా భావిస్తాను. రంగస్థలం సినిమా కథను సుకుమార్ చెప్పినపుడు అదృష్టంగా భావించాను. రాంచరణ్ చాలా సెన్సిబుల్. ఆయనతో పనిచేయడం చాలా ఈజీగా ఉంటుంది అని సమంత చెప్పింది.