Niharika will going to play key role in megastar's Sye Raa Narasimha Reddy

ఒక మనసు చిత్రంతో కొణిదల వారి అమ్మాయి నిహారిక నటిగా మారింది. తొలి ప్రయత్నం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. అయినా కూడా నిహారిక నటిగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఒక మనసు చిత్రం తరువాత నిహారిక ఆచి తూచి అడుగులు వేస్తోంది.
నిహారిక కేవలం తెలుగు చిత్రాలలోనే కాక తమిళ చిత్రాలలో సైతం నటించేందుకు ఆసక్తి చూపుతోంది. తమిళ ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చిత్రంలో నిహారిక నటిస్తోంది. అలాగే తెలుగులో సుమంత్ అశ్విన్ సరసన హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నటిస్తోంది.
నిహారిక తాజాగా ఓ బంపర్ ఆఫర్ సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి చిత్రంలో కీలక పాత్రలో నటించేందుకు నిహారికకు అవకాశం వచ్చిందనేది ఈ వార్తల సారాంశం.
సైరా చిత్రంలో నటించే అవకాశం రావడం నిహారిక కెరీర్ కు పెద్ద బూస్ట్ అని అంటున్నారు. నిహారిక ఈ చిత్రంలో ఎలాంటి రోల్ లో కనిపించబోతోంది అనే విషయంపై అధికారిక సమాచారం రావలసి ఉంది.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, జగపతి బాబు, కిచ్చా సుదీప్ ప్రముఖ నటులు సైరా చిత్రంలో నటిస్తున్నారు. నిహారిక నటించడం ఖాయం అయితే సైరా చిత్రం గురించి మెగా అభిమానుల్లో మరింతగా చర్చ జరగడం ఖాయం.