Surprise Me!

Bunny Vasu Given Clarity On Naa Peru Surya Rumours

2018-04-07 389 Dailymotion

Allu Arjun's Naa Peru Surya Na Illu India tipped to be a patriotic thriller will see the Telugu superstar portraying the titular role of a short tempered soldier Surya. Directed by writer-turned-director Vakkantham Vamsi, Naa Peru Surya has been bankrolled by Lagadapati Sridhar.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా. ఈ చిత్రం మే 4 రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఓ పాట మినహా షూటింగ్ అంతా ముగిసినట్టు సమాచారం. అయితే కొద్దిరోజులుగా మీడియాలో నా పేరు సూర్య చిత్రంపై అనేక రకాల రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రూమర్లను బన్నీ వాసు దృష్టికి తీసుకురాగా.. అందులో వాస్తవం లేదు అని ఆయన ఖండించారు. ఇంతకీ నా పేరు సూర్య చిత్రంపై వస్తున్న రూమర్లు ఏమిటంటే..
కథా రచయిత వక్కంత వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న నా పేరు సూర్య చిత్రం సరిగా రాలేదు. కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తున్నారు అనే వార్తలు మీడియాలో వస్తున్నాయి. దీంతో నా పేరు సూర్య రిలీజ్ డేట్ కూడా మారవచ్చు అని కథనాల్లో పేర్కొంటున్నారు.
నా పేరు సూర్య రూమర్లపై నిర్మాత బన్నీ వాసు స్పందిస్తూ.. సినిమా రీషూట్ చేయడం అనే వార్తలో ఎలాంటి వాస్తవం లేదు. సినిమా ప్రకటించిన తేదీకే విడుదల అవుతున్నది. ఇలాంటి వార్తలు ఎక్కడ నుంచి పుడుతాయో అర్ధం కాదు అని బన్నీవాసు అన్నారు.
వాస్తవానికి ఓ పాట షూటింగ్ మిగిలి ఉంది. అనుకొన్న డేట్ కంటే ఓ వారం ఆలస్యంగా పాటను షూట్ చేస్తున్నాం. అలాంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రూమర్ క్రియేట్ చేసి ఉంటారు. అంతకంటే ఇందులో చెప్పాల్సిన విషయం ఏమీ లేదు అని బన్నీ వాసు అన్నారు.

Buy Now on CodeCanyon