Bharat Ane Nenu pre-release event, Bharat Ane Nenu Release date, Mahesh Babu and wife Namrata hosted a party

మహేష్ బాబు తన తాజా సినిమా 'భరత్ అనే నేను' సినిమాపై సూపర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అందుకే ఎన్నడూ లేని విధంగా సినిమా విడుదల ముందే ఆయన తన ఇంట్లో ట్రీట్ ఏర్పాటు చేశారు. శనివారం భరత్ బహిరంగ సభ అనంతరం రామ్ చరణ్, ఎన్టీఆర్‌తో పాటు మెయిన్ టెక్నిషియన్స్, నిర్మాతలను ఇంటికి ఇన్వైట్ చేసి పార్టీ ఇచ్చారు.
మొదట ఈ పార్టీ ఏదో స్టార్ హోటల్‌లో జరిగింది అని అందరూ భావించారు. కానీ ఇది మహేష్ బాబు ఇంట్లోనే జరిగిందని నమ్రత వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఇందుకోసం ఇంటిని లైట్లు, ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారు. దినాజ్ నోరియా ఈ పార్టీ థీమ్‌ను డిజైన్ చేశారట.
భరత్ పార్టీలో నమ్రత గర్ల్ గ్యాంగ్ కూడా పాల్గొన్నారు. ఈ గ్యాంగ్ లో తప్పకుండా కనిపించే వ్యక్తి ఉపాసన. రామ్ చరణ్ తో పాటు ఉపాసన కూడా ఈ పార్టీకి అటెండ్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నమ్రత సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
మహేష్ బాబు ఇంట్లో జరిగిన పార్టీలో మహేష్, రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇతర మేల్ గ్యాంగ్ అంతా ఒక వైపు...... నమ్రత, ఉపాసన, గర్ల్ గ్యాంగ్ అంతా మరో వైపు పార్టీని ఎంజాయ్ చేశారు.
మహేష్ బాబు ఇంట్లో జరిగిన ఈ ట్రీట్‌కు ఎన్టీఆర్ హాజరైనా ఆయన సతీమని లక్ష్మి ప్రణతి మాత్రం హాజరు కాలేదు. అందుకు కారణం ప్రస్తుతం ఆమె ప్రెగ్నెంటుగా ఉండటమే.
ఈ పార్టీలో భరత్ హీరోయిన్ కైరా అద్వానీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు కూతురు సితారతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
చాలా కాలం తర్వాత మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి పెద్ద హీరోలంతా కలిసి ఒకే ఫ్రేములో కనిపించడం, అంతా కలిసి వేడుక చేసుకోవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.