Surprise Me!

రైల్‌రోకో,రిలే నిరాహార దీక్షలు...: వైసీపీ కార్యాచరణ

2018-04-10 135 Dailymotion

YSRCP is planned for statewide protests from today onwards. They given a call for road blocks on Tuesday

ప్రత్యేక హోదా సాధనా పోరాటాన్ని రాష్ట్రంలోనూ ఉధృతం చేయాలని వైసీపీ నిర్ణయించింది. టీడీపీ ఎంపీలు ఢిల్లీ నుంచి తిరుగు పయనమై.. ఇక రాష్ట్రంలోనే కార్యాచరణకు సిద్దమవుతున్న దశలో.. వైసీపీ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
హోదా ఉద్యమం తమ క్రెడిటే అని ముందు నుంచి ప్రచారం చేసుకుంటున్న వైసీపీ.. ఏ దశలోనూ టీడీపీకి అవకాశం ఇవ్వకూడదని భావిస్తోంది. హోదాపై టీడీపీ కార్యాచరణలో భాగంగా.. వైసీపీని లక్ష్యంగా చేసుకనే అవకాశం ఉంది గనుక, రాష్ట్రంలోనూ హోదాపై ప్రత్యేక కార్యాచరణ చేపట్టడానికి వైసీపీ సిద్దమైంది. టీడీపీ ఆరోపణలను, విమర్శలను తిప్పికొడుతూనే.. హోదా ఉద్యమాన్ని తాము ఎలా ముందు తీసుకెళ్తున్నది ప్రజలకు వివరించనుంది.
ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వైసీపీ ఎంపీలకు సంఘీభావంగా రాష్ట్రంలో ఇప్పటికే నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు మంగళవారం నుంచి మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని వైసీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో , బుధవారం నాడు రైల్‌రోకో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ నుంచి ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, సామర్లకోట, రాజమండ్రి, భీమవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, చిత్తూరు, కడప, గుంతకల్, గుత్తి, కర్నూలు, అనంతపురంలలో రైల్‌రోకోలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైసీపీ అధినాయకత్వం పిలుపునిచ్చింది.

Buy Now on CodeCanyon