"25 years ago it was a disaster at the box office, but it was my first child and will remain close to heart. Remembering madam Sridevi and my sorry to Boney Kapoor who gave me a break but was broke after the film." Roop Ki Rani Choron Ka Raja director Satish Kaushik tweeted.

శ్రీదేవి-అనిల్ కపూర్ కాంంబినేషన్లో 1993లో వచ్చిన 'రూప్ కి రాణి చోరోంకా రాజా' చిత్రం అప్పట్లో బాలీవుడ్లోనే బిగ్గెస్ట్ ప్లాప్ చిత్రంగా నిలిచింది.ఈ చిత్రాన్ని నిర్మించిన బోనీ కపూర్ దారుణంగా దెబ్బతిన్నాడు. ఈ సినిమా తర్వాత కొన్నాళ్ల పాటు ఆయన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యారు. ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలైన సందర్భంగా ఈ చిత్ర దర్శకుడు సతీష్ కౌషిక్ ట్విట్ చేశారు. ఈ సినిమా ద్వారానే సతీష్ కౌషిక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు.
ఈ సినిమా విడుదలై 25 సంవత్సరాలు అయిన సందర్భంగా దర్శకుడు సతీష్ లెజెండరీ యాక్ట్రెస్ శ్రీదేవిని గుర్తు చేసుకున్నాడు. తన వల్ల నిర్మాత బోనీ కపూర్ తీవ్ర నష్టాల పాలు కావడంపై సారీ చెప్పారు. తన ఫెయిల్యూర్‌ను ఒప్పకుంటూ ట్వీట్ చేశారు.
రూప్ కి రాణి చోరోంకా రాజా' చిత్రం విడుదలైన 25 సంవత్సరాలు పూర్తయింది. బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం చూపిన సినిమా. కానీ ఇది నా ఫస్ట్ చైల్డ్... నా మనసుకు ఎంతో దగ్గరైన చిత్రం. ఈ సినిమా పేరు విన్నపుడల్లా శ్రీదేవి మేడమ్ గుర్తుకు వస్తారు, బోనీ కపూర్ నాకు బ్రేక్ ఇద్దామని అవకాశం ఇచ్చారు, కానీ నేను పూర్తిగా విఫలం అయ్యాను.' అంటూ ట్వీట్ చేశారు.
25 ఏళ్ల క్రితమే ఈ చిత్రం 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఆ సమయంలో అత్యంత భారీ బడ్జెట్ బాలీవుడ్ సినిమా అది. అప్పట్లో రూ. 2 నుండి 3 కోట్లతో సినిమా తీయడమే ఎక్కువ..... అలాంటి రోజుల్లో బోనీ కపూర్ 9 కోట్లు ఖర్చు పెట్టి కొత్త దర్శకుడితో పెద్ద సాహసమే చేశాడు.