ఐపీఎల్ మ్యాచ్‌లో తెలుగు బ్యాట్స్‌మన్ అంబటి రాయుడు చెలరేగి ఆడాడు. సొంత గడ్డపై ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 37 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 79 పరుగులు చేసి.. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ప్రారంభంలో తడబడింది. మొదట్లో పరుగులు రావడం కష్టంగా కనిపించింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన రాయుడు తొలుత ఆచితూచి ఆడుతూ.. మెళ్లిగా పరుగుల వేగాన్ని పెంచాడు. రైనాకు జోడీగా స్కోర్ బోర్డును పరుగెత్తించాడు. <br />Chennai Super Kings Batsman Ambati rayudu Done a Brilliant Job in the match with Sunrisers Hyderabad, On the occassion of that Chennai Super kings team tweeted about his Innings as "Bahubali Innings". <br />
