An Air India aircraft flying from Amritsar to Delhi on Thursday (April 19) ran into such severe turbulence that three passengers suffered injuries, the inside part of a window panel came off and some overhead oxygen masks got deployed.The Boeing 787 Dreamliner (VT-ANI) had a very turbulent flight for 10 to 15 minutes during climb phase from 8,000 feet to 21,000 feet, the cause of which is being probed by the airline and aviation agencies. <br /> <br />ఎయిరిండియా విమానంలో ప్రమాదం చోటు చేసుకుంది. విండో దగ్గరలోని ఆక్సిజన్ మాస్క్ ప్యాసింజర్ల పైన ఊడిపడింది. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. డీజీసీఏ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. ప్రయాణీకులను బెంబేలెత్తించిన ఈ సంఘటన గురువారం (ఏప్రిల్ 19) అమృత్‌సర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిరిండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానంలో చోటు చేసుకుంది. ఇది తాజాగా వెలుగులోకి వచ్చింది. <br />విమానంలోని విండో ప్యానెల్ దగ్గరి మాస్క్ విరిగి ప్రయాణీకులపై పడిన ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. దీంతో దాదాపు పది నిమిషాల నుంచి పదిహేను నిమిషాల వరకు ప్రయాణీకులు బెంబేలెత్తిపోయారు. భయంతో వణికారు. విమానంలో సీటు బెల్టు ధరించని ఓ ప్రయాణీకుడు బంప్ వద్ద ముందున్న కేబిన్‌ను గుద్దుకున్నాడు. దీంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. బయటి విండో పగలకపోవడంతో ప్రమాదం తప్పింది. అక్కడి ఓవర్ హెడ్ ప్యానెల్ పగలడంతో ఆక్సిజన్ మాస్కులు కిందపడ్డాయని తెలుస్తోంది. వైర్లు వేలాడాయి. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న డీజీసీఏ ఈ విషయాన్ని ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డుకు తెలిపింది.