Surprise Me!

Rajinikanth to head to the US For A health inspection

2018-04-24 272 Dailymotion

Rajinikanth all set to go to US for medical checkup. For few weeks he will be there only.
#Rajinikanth
#Robo2.0
#Kaala

సూపర్ స్టార్ రజనీకాంత్ మరో మారు అమెరికాకు పయనం కానున్నారు. రొగ్య సమస్యలపై ఆయన మీడికల్ చెకప్ కోసం ఆయన యుఎస్ వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. రజని రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన తరువాత అభిమానులు ఎక్కువగా ఆయన గురించే చర్చించుకుంటున్నారు. త్వరలో పార్టీ స్థాపిస్తానని ప్రకటించిన రజనీకాంత్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్నారు.
ఇందులో కంగారు పడాల్సిన విషయం ఏమి లేదని ఆయన సన్నిహితులు అంటున్నారు. రజనీకాంత్ ప్రతి ఏడాది లాగే ఈ సంవత్సరం కూడా మెడికల్ చెకప్ కోసం వెళుతున్నారని అంటున్నారు. ఇందులో అభిమానులు ఆందోళన పడాల్సిన అంశం ఏమి లేదని, కాకపోతే రజని రాజకీయ ప్రకటన చేసిన తరువాత మీడియా హడావిడి పెరిగిందని చెబుతున్నారు.
రజనీకాంత్ నటించిన కాలా, రోబో 2.0 చిత్రాలు విడుదల కావలసి ఉంది. వీటిలో 2.0 చిత్రంపై సందిగ్దత ఇప్పటికి కొనసాగుతోంది. కాలా చిత్రం జూన్ 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో రజని గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నారు.ఈ తరుణంలో రజనీకాంత్ ఆరోగ్య విషయం చర్చనీయాంశగా మారడం, ఆయన అమెరికాకు మెడికల్ వెళుతుండడం అభిమానుల్లో కాస్త గందరగోళానికి కారణంగా మారింది.

Buy Now on CodeCanyon