Surprise Me!

IPl 2018: Sunriser's Team Members are Suffering From Injuries

2018-04-24 100 Dailymotion

Under pressure after slumping to their fourth loss in five games, defending champions Mumbai Indians (MI) have the onerous task of re-discovering their winning touch when face Sunrisers Hyderabad (SRH) in an IPL match here on Tuesday (April 24).
వరుసగా రెండు మ్యాచ్‌లలోనూ పరాజయాన్ని చవిచూసిన హైదరాబాద్ జట్టుకు మరో ఆటంకం ఎదురైంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాళ్లకు గాయాల బెడద పట్టుకుంది. సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌, భువనేశ్వర్‌ కుమార్‌ దూరమైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో యూసఫ్‌ పఠాన్‌ కూడా కాస్త ఇబ్బంది పడ్డాడు. దీంతో ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌కి ఎవరు దూరం అవుతారో, తుది జట్టులో ఎవరెవరు ఉంటారనేది సందిగ్ధం.
ఇప్పటికే ఈ మ్యాచ్‌కి భువనేశ్వర్‌ కుమార్‌ దూరమైనట్లు ఆ జట్టు కెప్టెన్ కేన్‌ విలియమ్సన్‌ వెల్లడించాడు. టోర్నీలో భాగంగా మంగళవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ జరగనుంది.
భువనేశ్వర్‌ జట్టుతో పాటు ముంబై రాలేదు. నడుం నొప్పితో తీవ్రంగా బాధపడుతోన్న భువికి ఫిజియోలు విశ్రాంతి సూచించారు. అందుకే అతడు ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదు. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడిన ధావన్‌ ఈ మ్యాచ్‌కి అందుబాటులోకి వస్తాడని భావిస్తున్నా.
యూసుఫ్‌ పఠాన్‌ కూడా 100శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పలేను. చెన్నై, పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో రషీద్‌ ఖాన్‌ భారీగా పరుగులిచ్చాడు. అతనో వరల్డ్‌ క్లాస్‌ బౌలర్‌. తదుపరి మ్యాచ్‌లో అతడు పుంజుకుంటాడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.
టోర్నీ ఆరంభంలో హ్యాట్రిక్‌ విజయాలతో దూసుకుపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఈ సీజన్‌లో రెండోసారి ముంబై ఇండియన్స్‌తో తలపడుతున్న సన్‌రైజర్స్‌ మరోసారి విజయాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ వికెట్‌ తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Buy Now on CodeCanyon