Kaasi is a Telugu movie Casted With Vijay Anthony,Anjali and Sunainaa in prominent roles. It is an action drama directed by Kiruthiga. <br /> <br /> తెలుగులో పాపులర్ అయిన విజయ్ ఆంటోనీ త్వరలో ‘కాశి’గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సునయన, అంజలి హీరోయిన్లుగా.. కిరుతుగ ఉదయనిధి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని భార్య ఫాటిమా విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌ను బట్టి ‘కాశి’ మూవీలో మరోసారి మదర్ సెంటిమెంట్ చూపించబోతున్నాడు విజయ్ ఆంటోనీ. <br />ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి విజయ్ ఆంటోనీ వరుస ఫ్లాప్‌ల తరువాత ‘కాశీ’ చిత్రంతో బిచ్చగాడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి. <br />