Telangana Chief Minister K Chandrasekhar Rao warns BJP and Congress in TRS plenary.

ఈ దేశానికి తెలంగాణ గడ్డ నుంచి మేలు జరగాలన్నదే తన ధ్యేయమని కేసీఆర్ అన్నారు. ఈ వేదిక పై నుంచి (ప్లీనరీ) కఠోర సత్యాలు చెబుతున్నానని కొన్ని ఉదాహరణలు చెప్పారు. మనం బీజేపీ కాదంటే కాంగ్రెస్, కాంగ్రెస్ కాదంటే బీజేపీకి ఓటు వేస్తున్నామని (కేంద్రంలో), ఇన్నాళ్లు వారి డ్రామాలు నడిచాయన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ఉదాహరణలు చెప్పారు.
కావేరీ నీటి విషయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయన్నారు. భారత్‌లో నీటి యుద్ధాలు అంటుంటారని, మీ అసమర్థ పాలన వల్లే నీటి యుద్ధాలు అన్నారు.
రాష్ట్రాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు, ప్రాంతాలకు మధ్య నీటి యుద్ధాలు పెట్టారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై కేసీఆర్ నిప్పులు చెరిగారు.భారత దేశ రైతాంగాన్ని ఆ పార్టీలు నష్టపరిచాయన్నారు. తమ ఫెడరల్ ఫ్రంట్ నీటి యుద్ధాలను సర్దుబాటు చేస్తుందని చెప్పారు. ప్రాంతీయ పార్టీల సమన్వయ కూటమి నిజమైన ఫెడరల్ స్ఫూర్తితో ముందుకు సాగుతుందన్నారు.
#TRS
#KCR
#Plenary
#Hyderabad
#Modi
#Rahul gandhi
#Amith sha