Allu Arjun Mind Blowing Entry Naa Peru Surya Na Illu India Pre Release Event. Starring #AlluArjun, #AnuEmmanuel, Music composed by Vishal–Shekhar, Directed by Vakkantham Vamsi and Produced by Sirisha Sridhar Lagadapati, Bunny Vas under the banner of Ramalakshmi Cine Creations. <br />అల్లు అర్జున్ హీరోగా వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నా పేరు సూర్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకలో బన్నీ ఎంట్రీ ఎవరూ ఊహించని విధంగా జరిగింది. సైనిక సాంగ్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో వెనక వైపు మువ్వన్నెల జెండాతో ఆకాశం నుండి అల్లు అర్జున్ అదిరిపోయే విధంగా ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు. <br />కె. నాగబాబు సమర్పణలో, రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్లో శిరీష శ్రీధర్ నిర్మాతగా, బన్నీ వాసు సహ నిర్మాతగా ఈ చిత్రం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అనూ ఎమ్మాన్యూయేల్ యాక్షన్ కింగ్ అర్జున్, శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. <br />