Surprise Me!

IPL 2018:du plesis Interview On MS dho

2018-05-02 66 Dailymotion

Du plesis talking about Ms Dhonis performance.he also praised rayudu,raina for their performance.

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. గత కొన్నేళ్లుగా ధోనీ బ్యాటింగ్‌లో దూకుడు తగ్గిందని, మ్యాచ్‌లను గొప్పగా ముగించడంలో విఫలమవుతున్నాడని ఇక ధోనీ పనైపోయిందని విశ్లేషకులు తమదైన శైలిలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుగా క్రీజులోకి వచ్చి మునుపటిలానే మ్యాచ్‌లను ఫినిష్ చేస్తున్నాడు.
చెన్నై సూపర్‌ కింగ్స్‌ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీపై ఆ జట్టు ఆటగాడు డుప్లెసిస్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. టోర్నీలో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌‌, ఢిల్లీ డేర్‌‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బౌలర్లపై విరుచుకు పడుతూ, బౌండరీలు బాదుతూ హాఫ్ సెంచరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ధోనీ ఫామ్‌ గురించి డుప్లెసిస్‌ మాట్లాడాడు.
ప్రస్తుతం ధోనీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సమయం బౌలర్లకు ఎంతో కఠినమైనది. వైడ్ వేసిన బంతిని సైతం ధోనీ ఎదుర్కొనేందుకు ప్రయత్నిస్తాడు. బంతిని హిట్‌ చేసేందుకు అతని వద్ద చాలా అవకాశాలు ఉన్నాయి. ఎలా కావాలంటే అలా కొట్టగలుగుతున్నాడు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం. ధోనీ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు, కెప్టెన్లకు చాలా కష్టం' అని అన్నాడు డుప్లెసిస్‌.

Buy Now on CodeCanyon