Pawan Kalyan remembers Dasari Narayana Rao on his birth anniversary
#PawanKalyan
# DasariNarayanaRao

దర్శక రత్న దాసరి నారాయణ రావు జయంతి నేడు. ఆయన జయంతిని తెలుగు చిత్ర పరిశ్రమ డైరెక్టర్స్ డేగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గత ఏడాదే దాసరి నారాయణ రావు తుది శ్వాసవిడిచారు. దర్శకుడిగా, నటుడిగా ఆయన సాధించిన విజయాలు అసామాన్యమైనవి. దాసరి జయంతి సందర్భంగా పవన్ కళ్యాణ్ స్పందించారు. దాసరి సాధించిన విజయాల్ని, ఇండస్ట్రీలో తలెత్తిన సమస్యలు పరిష్కారానికి ఆయన చూపిన చొరవని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఇటువంటి పరిస్థితుల్లో దాసరి ఉండిఉంటే బావుండేదని పవన్ కళ్యాణ్ అన్నారు. పలు విషయాల్లో దాసరిని పవన్ కీర్తించారు. ఇండస్ట్రీలో ఏ సమస్య వచ్చినా దాసరి ముందుండి పరిష్కరించిన సందర్భాలు చాలా ఉన్నాయి.
దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకుడి స్థాయిని పెంచారు. దర్శకుడు అనే పేరుకు ఆయన బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చారని పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి దాసరి గారి జన్మదిన వేడుకని డైరెక్టర్స్ డే గా జరుపుకోవడం చాలా సంతోషకరం అని పవన్ అన్నారు.
దాసరి తొలి చిత్రం తాతామనవడు నుంచి ఆయన చిత్రాల్లో కుటుంబ విలువలు, సామజిక సృహ కనిపించేదని అన్నారు. దాసరి కేవలం దర్శకుడిగా మాత్రం కాక నటుడిగా కూడా అనేక విజయాలు సాధించారు.
రంగస్థలం నుంచి ఆయన సినిమాల్లోకి ప్రవేశించారు. దర్శకుడిగా తిరుగులేని ప్రతిభ కనబరుస్తూ ఎదిగారు. దాసరి రాజకీయ నాయకుడిగా కుడా సేవలు అందించిన సంగతి తెలిసిందే.
చిత్ర పరిశ్రమలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేవారు. సినీ ఇండస్ట్రీ కుటుంబం అని మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలనే భావన దాసరితో ఉండేదని పవన్ అన్నారు.