Dasari Narayana Rao Statue Inauguration At TFCC Office. Krishna and Balakrishna participate this event
#DasariNarayanaRao
#Krishna
#Balakrishna

దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా ఫిలిం ఛాంబర్ వద్ద దాసరి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. దాసరి జ్ఞాపకార్థం సినీ ప్రముఖులు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ, విజయ నిర్మల, బాలకృష్ణ, మురళి మోహన్ వంటి సినీప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా దాసరితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. దాసరి నారాయణ రావు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న సంగతి తెలిసిందే. గత ఏడాది దాసరి అనారోగ్య కారణంగా తుదిశ్వాస విడిచారు. దాసరి మరణించిన తరువాత తొలి జయంతి వేడుకలు కావడంతో నేడు ఫిలిం ఛాంబర్ వద్ద విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.
దాసరి నారాయణరావు తనకు దర్శకుడు కాకముందు నుంచే పరిచయం అని సూపర్ స్టార్ కృష్ణ అన్నారు. మానాన్న నిర్దోషి చిత్రానికి దాసరి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారని కృష్ణ గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత మేనకోడలు, హంతకుడు దేవాంతకుడు వంటి చిత్రాలకు డైలాగ్స్ రాసారని, తాను నటించిన మరెన్నో చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారని కృష్ణ అన్నారు.
దాసరి 150 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్ రికార్డు క్రియేట్ చేశారని అన్నారు. గతంలో ఇన్ని చిత్రాలకు దర్శకత్వం వహించిన వారు లేరని, ఇక మీదట రారని కృష్ణ అన్నారు.
నీదారిలో నువ్వు నడువు.. విజయం వరిస్తుందని నాన్నగారు చెప్పేవారు. ఆ కోవకు చెందినవారే దాసరి అని బాలయ్య అన్నారు. ఇండస్ట్రీలో చిన్న సమస్య వచ్చినా తన ఇంట్లో సమస్యగా భావించి పరిష్కరించేవారని బాలయ్య కొనియాడారు.
దాసరి దర్శకత్వం వహించిన శివరంజని చిత్రానికి హీరోగా మొదట తనని అనుకున్నారని బాలయ్య తెలిపారు. ఈ విషయం గురించి దాసరి నాన్నగారిని(ఎన్టీఆర్) అడిగారు. బాబు చదువుకుంటున్నాడు ఇప్పుడు వద్దులే అని నాన్నగారు అన్నారు. దాసరి ముక్కు సూటిగా మాట్లాడే మనిషి అని, న్యాయం వైపు నిలబడే వారని బాలయ్య దాసరిని కొనియాడారు.