Naa Peru Surya special show for army personnel. Naa Peru Surya gets good response from all over.
#NaaPeruSurya
#AlluArjun

అల్లు అర్జున్ నటించిన తాజగా చిత్రం నాపేరు సూర్య శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అభిమానుల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బన్నీ ఆర్మీ మాన్ గా నటించిన సంగతి తెలిసిందే. మిలటరీ అధికారి పాత్రలో అల్లు అర్జున్ నటన అదుర్స్ అనిపించే విధంగా ఉంది. బన్నీ తనపాత్రలో ఒదిగిపోయి నటించాడని అంతా ప్రశంసిస్తున్నారు. చిత్రానికి మంచి స్పందన వస్తుండడంతో పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ వేగం పెంచాలని చిత్రయూనిట్ భావిస్తోంది. హైదరాబాద్ లోని మాజీ ఆర్మీ అధికారుల కోసం నా పేరు సూర్య చిత్ర యూనిట్ స్పెషల్ షోని ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది.
ఆర్మీ నేపథ్యంలో చిత్రం కావడంతో ఆ దిశగా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ చేస్తోంది. ఈ చిత్ర ఆడియో వేడుకని మిలిటరీ మాధవరంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రాన్ని మెగా బ్రదర్ నాగబాబు సమర్పించారు. వక్కంతం వంశి తొలిసారి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.