Surprise Me!

Pawan Kalyan To Attend Nela Ticket Audio Launch

2018-05-08 402 Dailymotion

Reason behind Pawan Kalyan as chief guest for Nela Ticket audio. Rumors gone viral in social media
#PawanKalyan
#NelaTicket

పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రం తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ కార్యక్రమాలతో బిజీ అయిపోయారు. అభిమానుల కోసం పవన్ కళ్యాణ్ మరో చిత్రం చేసే అవకాశాలు కనిపించడం లేదు. ఎందుకంటే వచ్చే ఏడాదే ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవల పవన్ కొన్ని సినిమా ఈవెంట్స్ హాజరవుతూ అభిమానులని ఖుషి చేస్తున్నారు. రంగస్థలం చిత్ర సక్సెస్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, రాంచరణ్ కలయిక మెగా అభిమానులని ఆకట్టుకుంది. తాజాగా పవన్ కళ్యాణ్ మరో సినిమా ఈవెంట్ లో సందడి చేయడానికి రెడీ అయిపోయాడు.
కొన్ని వారాల నుంచి పవన్ కళ్యాణ్ నేల టికెట్టు ఆడియో లాంచ్ కు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇటీవల చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సినిమా ఈవెంట్స్ కు వెళ్లడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. సినిమా ఫంక్షన్స్ కు పవన్ దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కానీ రాజకీయల్లోకి వచ్చాక పవన్ కొన్ని ఈవెంట్స్ కు హాజరవుతున్నారు.
నేల టికెట్టు ఆడియో ఈవెంట్ కు హాజరు కావాలని చిత్ర నిర్మాత రామ్ తాళ్లూరి పవన్ ని రిక్వస్ట్ చేశారట. ఆయన ఆహ్వానం మేరకే పవన్ ఆడియో వేడుకకు హాజరవుతున్నట్లు తెలుస్తోంది.
ఇందులో రాజకీయ కోణం కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. రామ్ తాళ్లూరి ప్రముఖ వ్యాపారవేత్త. ఆయన జనసేన పార్టీకి ఆర్థికంగా సాయం చేస్తున్నారనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. భవిషత్తులో రామ్ తాళ్లూరి జనసేన పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేసే అవకాలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల నేపథ్యంలో ఆడియో వేడుకలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతారో చూద్దాం!

Buy Now on CodeCanyon