Jana Sena President and actor Power Star Pawan Kalyan is going to set a new record today on 10th May in Hyderabad. Commemorating the first war of Independence (1857), Jana Sena Chief Pawan Kalyan will unfurl the World’s largest Indian Tricolour (122 ft x 183 ft) today i.e 10th May at NTR Stadium. The tricolor is of 22,326 sq feet in size.
#PawanKalyan
#janasena
#NationalFlag

ప్రపంచ అతిపెద్ద జాతీయ జెండా(22,326 స్క్వేర్ ఫీట్లు)ను ఎన్టీఆర్ స్టేడియంలో ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురువారం ఆవిష్కరించారు. ఓ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పవన్ పాల్గొని జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా సదరు సంస్థకు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. జులై 22, 1947లో మన జాతీయ జెండాకు జవహర్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలోని సభ్యులు ఆమోదం తెలిపారని చెప్పారు. జెండాలోని రంగులు కానీ, ధర్మ చక్రం కానీ.. జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు.
జాతీయ జెండా అంటే అది ఏదో ఒక పార్టీది , మతానిది , ప్రాంతానిది కాదని.. ప్రతీ ఒక్కరిదని సర్వేపల్లి రాధాకృష్ణ అన్నారని పవన్ చెప్పారు.
జాతీయ జెండాను చూసినప్పుడల్లా ఉవ్వెత్తున ఎగిసిపడే గుండె ధైర్యం, దేశాన్ని ముందుకు తీసుకెళ్లగలిగే ఆత్మస్థైర్యం రెపరెపలాడుతోందని అన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని అన్నారు. దేశ భక్తి రాజకీయ నాయకులు మర్చిపోయారు కానీ, విద్యార్థులు, యువత కాదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన అక్కడున్న వారితో ప్రతిజ్ఞ చేయించారు.