Hero Vikram,keerthi suresh Movie Going To Get Released In Telugu.Saamy 2, the sequel to 2003 super-hit Saamy, will once again have Vikram playing the role of a police officer. Vikram Saamy 2 titled as Saamy Square. Beautiful actresses Keerthi Suresh are going to play the female leads in the movie. <br /> <br />తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన చిత్రం సామి స్క్వేర్. విక్రమ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు హరి ఈ సినిమాను తెరకేక్కిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క తమిళ మోషన్ పోస్టర్ మొన్ననే విడుదలై అనూహ్య స్పందన తెచ్చుకుంది. 2003లో వచ్చిన సామి సినిమాకు ఈ సినిమా సీక్వెల్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను తమీస్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. హరి-విక్రమ్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన 'సామి' అప్పట్లో మంచి విజయం సాధించింది. మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కాబోతుందడంతో ఈ సినిమా హిట్ అవుతుందని ఫ్యాన్స్ విక్రమ్ ఫాన్స్ అంటున్నారు. <br />సామి స్క్వేర్ మోషన్ పోస్టర్ ను తెలుగులో కూడ రిలీజ్ చేయనున్నారు. రేపు 20వ తేదీన పోస్టర్ విడుదలకానుంది. విక్రమ్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. డైరెక్టర్ హరి సినిమాలకి తెలుగునాట మంచి క్రేజ్ ఉంది. అతను దర్శకత్వం వహించిన యముడు, ఆరు, సింగం సినిమాలు మంచి విజయాలు సాధించాయి. సామి స్క్వేర్ సినిమాని మంచి స్థాయిలో భారీగా విడుదలచేయనున్నారు.