AravindhaSametha Veera Raghava First Poster Going Viral.NTR had two shades in AravindhaSametha Veera Raghava. Trivikram is directing this movie. <br /> <br />ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రంపై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఈ టైటిల్, ఎన్టీఆర్ పాత్ర గురించి ఆసక్తికర కథనాలు మీడియాలో వస్తున్నాయి. త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో రూపు దిద్దుకుంటున్న తొలి చిత్రం ఇదే. ఆసక్తికరమైన కథతో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిక్స్ ప్యాక్ లుక్ లో ఎన్టీఆర్ లుక్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. <br />అరవింద సమేత వీర రాఘవ టైటిల్ త్రివిక్రమ్ స్టైల్ లో ఉందంటూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ చిత్రానికి మొదట రాఘవ అనే టైటిల్ ఫిక్స్ చేయాలనీ భావించారట. కానీ ఎన్టీఆర్ పాత్రని దృష్టిలో పెట్టుకున్న త్రివిక్రమ్ అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. <br />టైటిల్ డిజైన్ విషయంలో త్రివిక్రమ్ సెంటిమెంట్ ని ఫాలో అయినట్లు కూడా తెలుస్తోంది. అత్తారింటికి దారేది, అ.. ఆ చిత్రాలలో అ సెంటిమెట్ కలసి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ అజ్ఞాతవాసి చిత్రం బెడిసికొట్టింది.