Interesting news on Saidharam Tej and Kishore Tirumala movie. Saidharam Tej doing new experiment
#SaidharamTej
#KishoreTirumala

మెగా హీరో సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఇటీవల కాలంలో తేజు సరైన కథలు ఎంచుకోకపోవడంతో వరుసగా ఎదురుదెబ్బలు తినాల్సి వచ్చింది. తదుపరి చిత్రంతో ఎలాగైనా హిట్ అందుకోవాలని కరుణాకరన్ దర్శకత్వంలో తేజు నటిస్తునాడు.
ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రం తేజ్ ఐ లవ్ యు. కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.తేజ్ ఐ లవ్ యు అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రం రొమాంటిక్ లవ్ స్టొరీగా రాబోతోంది.
మరోవైపు కిషోర్ తిరుమల దర్శకత్వంలో తేజు నటించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం గురించి ఆసక్తికరైన ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్ సూపర్ హిట్ చిత్రం చంటబ్బాయ్ స్పూర్తితో ఈ చిత్రం రాబోతునట్లు తెలుస్తోంది.
కమర్షియల్ చిత్రాలు పెద్దగా కలసి రాకపోవడంతో తేజు విభిన్నంగా ప్రయత్నిస్తున్నాడు. చంటబ్బాయ్ చిత్రంలో మెగాస్టార్ చిరు తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు. తేజు కూడా ఈ చిత్రంలో తనలోని కామేడి యాంగిల్ ని బయటకు తీయాలని భావిస్తునట్లు తెలుస్తోంది.