Surprise Me!

కుమారస్వామి ప్రమాణస్వీకారం, బెంగళూరు చేరుకున్న ప్రముఖుల అవస్థలు

2018-05-23 1 Dailymotion

Karnataka Election results 2018: Heavy rains in bengaluru, JDS state chief HD Kumaraswamy to be sworn in as 25th chief minister of Karnataka today.
#karnatakaelectionresults2018
#hdkumaraswamy
#heavyrains
#bengaluru

బెంగళూరు నగరంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు కర్ణాటక 25వ ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు. ఈ సందర్బంలో బెంగళూరు నగరంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి.
బెంగళూరులోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడుతున్నాయి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యనున్న విధాన సౌధ దగ్గర వర్షం పడుతోంది. ముఖ్యమంత్రిగా కుమారస్వామి పదవీస్వీకార కార్యక్రమానికి వర్షం అడ్డంకిగా మారే అవకాశం ఉంది.
విధాన సౌధలోని బ్యాంక్వేట్ హాల్ లో కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బ్యాంక్వేట్ హాల్ ల్లోకి ప్రముఖులు మాత్రమే వెల్లడానికి అవకాశం ఉంది. అయితే బుధవారం సాయంత్రం 4.30 గంటలకు వర్షం పడటం తగ్గిపోతే అనుకున్నట్లే విధాన సౌధ ముందు భాగంలో హెచ్.డి. కుమారస్వామి ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.
కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొనడానికి ఇప్పటికే ప్రముఖులు బెంగళూరు చేరుకున్నారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, నారా చంద్రబాబు నాయుడు, మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్ మంత్రి అమరనాథరెడ్డి, సీఎం రమేష్ తదితరులు బెంగళూరు చేరుకున్నారు.

Buy Now on CodeCanyon