Surprise Me!

IPL 2018: Good And Bad Records In IPL History

2018-05-24 53 Dailymotion

Ambati Rayudu scored his first IPL and T20 century as Chennai Super Kings beat table-toppers Sunrisers Hyderabad eight wickets on Sunday.
#ipl2018
#ambatirayudu
#sunrisershyderabad
#chennaisuperkings

గత పదేళ్ల ఐపీఎల్‌లో ఆటగాళ్లు కొత్త రికార్డులు నమోదు చేయడం.. అలాగే తమ ఖాతాలో చెత్త రికార్డులనూ నమోదు చేయడం ఎప్పటి నుంచో ఆనవాయితీ వస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో కొత్త రికార్డులు నమోదు కాగా, మరికొన్ని చెత్త రికార్డులు నమోదయ్యాయి.
రోహిత్ శర్మ ఈ సీజన్‌లో లీగ్ దశలో 14 మ్యాచ్‌ల్లో కేవలం 286 పరుగులు మాత్రమే చేశాడు. ఐపీఎల్‌ ప్రారంభమైనప్పటి నుంచి రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా మాత్రమే ప్రతి సీజన్‌లోనూ 300లకు పైగా పరుగులు చేస్తూ వస్తున్నారు. కానీ, ఈ సీజన్‌లో రోహిత్‌ శర్మ పేలవ ప్రదర్శన కారణంగా ఈ ఘనత సాధించలేకపోయాడు.
ఒక సీజనులో ఒక జట్టు మీద సెంచరీ సాధించి, మళ్లీ అదే జట్టు మీద మరో మ్యాచ్‌లో డకౌట్‌గా వెనుదిరిగిన ఆటగాళ్ల జాబితాలో చెన్నై సూపర్‌కింగ్స్‌ ఆటగాడు అంబటి రాయుడు చేరాడు. లీగ్‌ దశలో ఇదే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించిన రాయుడు ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో భాగంగా జరిగిన తొలి క్వాలిఫయిర్‌లో డకౌటయ్యాడు.
ఈ జాబితాలో ఏబీ డివిలియర్స్ అందరికంటే ముందు వరుసలో ఉన్నాడు. 2009లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన డివిలియర్స్.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ(105నాటౌట్‌)‌తో అద్భుత ప్రదర్శన చేశాడు. కానీ ఆ తర్వాత అదే చెన్నైతో జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం పరుగులేమీ చేయకుండా డకౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.
2010లో ఢిల్లీ డేర్స్‌డెవిల్స్‌కు ఆడిన డేవిడ్‌ వార్నర్‌ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌ (107నాటౌట్‌) సెంచరీతో చెలరేగగా.. ఆ తర్వాత కోల్‌కతాతో జరిగిన మరో మ్యాచ్‌లో డకౌటయ్యాడు.

Buy Now on CodeCanyon