Andhra Pradesh IT Minister Nara Lokesh said that what happened to the Bharatiya Janata Party (BJP) in Karnataka Assembly polls was just a 'trailer' and that a 'real cinema' would be shown in 2019 general election. <br /> <br />ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా పని చేసే ఏ పార్టీతో అయినా తాము కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు. ఇకపై బీజేపీ ఏ రాష్ట్రంలో గెలిచే అవకాశాలు లేవని చెప్పారు. <br />బీజేపీ పైన పోరాటం చేసేందుకు అన్ని పార్టీలు ఏకం కావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి, అన్ని పార్టీల నేతలను ఆహ్వానించే యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని చెప్పారు. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పనున్నారని, ప్రాంతీయ పార్టీలు కలిస్తేనే బీజేపీకి బుద్ధి చెప్పే వీలుందన్నారు. <br />కర్ణాటకలో జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వేదికపై 13 పార్టీల అధినేతలు, పలువురు ముఖ్యమంత్రులు ఉండటం, ఎన్నికల్లో తెలుగు ఓటర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారనే వ్యాఖ్యలపై నారా లోకేష్ స్పందించారు. బీజేపీకి వ్యతిరేకంగా అందరూ ఒక్కటవుతున్నారని, కర్ణాటకలో అన్ని పార్టీలు ఏకమైంది కేవలం ట్రయలర్ మాత్రమేనని, 2019లో అసలు సినిమా ఉందని చెప్పారు.