No takers for Nagarjuna-RGV’s officer. Here is the reasons
#Nagarjuna
#RGV

ఏ ముహూర్తాన వర్మ, నాగార్జున ఆఫీసర్ చిత్రం మొదలైందో కానీ అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. మొదట ఈ చిత్రం మే 25 న విడుదలవుతుందంటూ ప్రకటించారు. కానీ జూన్ 1 కి విడుదల వాయిదా పడింది. దీనికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య ఈ చిత్రంపై బాంబే కోర్టులో కేసు నమోదైందని వార్తలు వచ్చాయి. ఈ చిత్ర కథ నాదే అంటూ ఓ యువ రచయిత తెరపైకి వచ్చాడు. తాజగా ఆఫీసర్ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్స్ సమస్య ఎదురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆఫీసర్ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ముందుకు రావడం లేదట. ఆర్జీవీ, నాగ్ సినిమకు తలెత్తిన ఈ పరిస్థికి కారణం అంటూ జాతీయ ఆంగ్ల పత్రికలో ఆసక్తికర కథనం వెలువడింది.
నాగార్జున సన్నిహితుడు శివప్రసాద్ రెడ్డి కృష్ణ ఏరియాలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సీడెడ్ హక్కులని ఎన్ వి ప్రసాద్ దక్కించుకున్నారట. నైజాంతో పాటు మరి కొన్ని ఏరియాలలో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు బయ్యర్లు ఆసక్తి చూపడం లేదట.
ఆఫీసర్ చిత్రాన్ని ఆయా ఏరియాలలో సొంతగా విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర కోప్రొడ్యూసర్ సుధీర్ చంద్ర మాట్లాడుతూ '' మహేష్, బన్నీ లాంటి పెద్ద హీరోల చిత్రాలకు మాత్రమే బయ్యర్లు ఆసక్తి చూపుతారని, మిగిలిన చిత్రాలకు నిర్మాతలే సొంతంగా విడుదల ప్లాన్ చేసుకుంటారని ఆయన అన్నారు. కానీ నాగార్జున చిన్న నటుడు కాదు కదా అనే ప్రశ్న తలెత్తుతోంది.
నైజాం ఏరియాలో ఓ పెద్ద డిస్ట్రిబ్యూటర్ అభిప్రాయం ఇలా ఉంది. 'ఈ చిత్రంలో నాగార్జున తప్ప మరో తెలుగు నటుడు లేడు. వర్మ మంచి దర్శకుడే. కానీ అతడి చిత్రాలని కొనుగోలు చేయడం రిస్క్ తో కూడుకున్న పని అని బయ్యర్లు భావిస్తున్నారు' అని ఆ డిస్ట్రిబ్యూటర్ తెలిపాడు.