Kolkata Knight Riders skipper Dinesh Karthik said they were under pressure in the Eliminator against Rajasthan Royals but eventually came up trumps to win by 25 runs and make Qualifier 2 of the Indian Premier League on Wednesday.
#ipl2018
#dineshkarthik
#kolkataknightriders
#rajasthanroyals

ఐపీఎల్ 11వ సీజన్ వేలానికి ముందు రెండు సార్లు ఐపీఎల్ టైటిల్‌ను అందించిన గౌతం గంభీర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ యాజమాన్యం వదులుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత కెప్టెన్‌గా ఎవరును నియమించాలనే దానిపై ఆ జట్టు యాజమాన్యం తీవ్ర తర్జన భర్జనలు పడింది.
కోల్‌కతా కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్‌ను ఎంపిక చేయాలా? లేక రాబిన్ ఉతప్పకు పగ్గాలు అప‍్పచెప్పాలా? అనే అంశంపై లోతుగా విశ్లేషించింది. చివరకు కోల్‌కతా యాజమాన్యం దినేశ్ కార్తీక్‌వైపే మొగ్గుచూపింది. తనపై కేకేఆర్ యాజమాన్యం పెట్టుకున్న నమ్మకాన్ని దినేశ్ కార్తీక్ వమ్ము చేయలేదు.
ఈ సీజన్ ఆరంభం నుంచీ దినేశ్ కార్తీక్ జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. తన ప్రదర్శనతో కెప్టెన్‌గా జట్టులోని మిగతా ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచాడు. దీంతో పాటు ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దినేశ్ కార్తీక్ నిలిచాడు.
ఈ సీజన్‌లో దినేశ్ కార్తీక్ ఇప్పటివరకు 490 పరుగులు చేశాడు. ప్రస్తుత సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున ఓ ఆటగాడు చేసిన ఆత్యధిక పరుగులు ఇవే కావడం విశేషం. గత సీజన్ల పరంగా చూస్తే కోల్‌కతా నైట్‌రైడర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రాబిన్ ఉతప్ప(660-2014 సీజన్) ముందు వరుసలో ఉన్నాడు.