Surprise Me!

Rashid Khan Blitz Was Not A Surprise: Yusuf Pathan

2018-05-26 213 Dailymotion

Rashid Khan may have surprised many with his absolute blinder with the bat against Kolkata Knight Riders in the second qualifier but for the Sunrisers Hyderabad camp it was ‘not a surprise’, said veteran Yusuf Pathan.
#ipl2018
#rashidkhan
#t20spinner
#yusufpathan
#sunrisershyderabad

ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన రెండో క్వాలిఫియర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు బ్యాట్‌తో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు 18.1 ఓవర్లు ముగిసే సమయానికి 138/7తో నిలిచి తక్కువ స్కోరుకే పరిమితమయ్యేలా కనిపించినప్పటికీ, చివర్లో వరుస సిక్సర్లతో రషీద్ ఖాన్ చెలరేగడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ అనంతరం రషీద్ ఖాన్ బ్యాటింగ్ ప్రదర్శన మిమ్మల్ని ఆశ్చర్యపరిచిందా? అని యూసఫ్ పఠాన్‌ని ప్రశ్నించగా ఎంతమాత‍్రం ఆశ్చర్యపరచలేదని తెలిపాడు. ఈ సందర్భంగా యూసఫ్ పఠాన్ మాట్లాడుతూ 'రషీద్ ఖాన్ చాలా ప్రతిభ ఉన్న క్రికెటర్. రషీద్‌ బ్యాట్‌తో మెరుపులు మెరిపించడం మమ్మల్ని ఆశ్చర్య పరచలేదు. అతను చాలా సందర్భాల్లో సిక్సర్లు, బౌండరీలతో విరుచుకుపడ్డాడు' అని అన్నాడు.
బిగ్‌బాష్, ఇతర విదేశీ లీగ్స్‌లో రషీద్ మెరుగ్గా బ్యాటింగ్ చేస్తుంటాడు. అతని సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది. అందుకే అతన్ని ఒక స్థానం ముందుకు ప‍్రమోట్‌ చేశాం. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లోనూ అతను రెండు చూడచక్కని సిక్సర్లు బాదాడు. అతడి ఆ హిట్టింగ్‌ మమ్మల్ని ఏమీ ఆశ్చర్యపరచలేదు. సన్‌రైజర్స్‌ పెట్టుకున్న నమ్మకాన్ని రషీద్‌ నిలబెట్టాడు' అని పఠాన్ వెల్లడించాడు.

Buy Now on CodeCanyon