Surprise Me!

ఎన్టీఆర్ బయోపిక్: వాల్మీకి దొరికాడంటూ దర్శకుడి పేరు ప్రకటించిన బాలయ్య!

2018-05-28 864 Dailymotion

On the eve of NTR’s birth anniversary, makers of the legendary actor-politician’s biopic made an important announcement. Krish Jagarlamudi will be directing the film. The announcement was made through a video, voiced by Balakrishna himself as he hoped to get his father’s blessing for the project. <br />నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ బయోపిక్ నుండి దర్శకుడు తేజ అనుకోని కారణాలతో తప్పుకోవడంతో ఈ ప్రాజెక్టు బ్రేక్ పడింది. అయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ సినిమాను తాను అనుకున్న విధంగా తీయగలిగే సత్తా ఉన్న దర్శకుడిని ఎంపిక చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన బాలయ్య తన వందో చిత్రానికి దర్శకత్వం వహించిన క్రిష్ జాగర్లమూడి పేరు వెల్లడించారు. <br />జనని భారతి మెచ్చ... జగతి హారతులెత్త... జనశ్రేణి ఘనముగా దీవించి నడుపగా..రణభేరి మ్రోగించె తెలుగోడు..జయగీతి నినదించె మొనగాడు..‘‘యన్. టి. ఆర్'' అని పేర్కొన్న బాలయ్య ఆ నాటి రామకథను ఆ రాముడి బిడ్డలైన లవకుశలు చెప్పారు, నేటి రామకథను ఈ రాముడి బిడ్డలమైన మేము చెప్తున్నాము.. అని వెల్లడించారు. <br />చేసే ప్రతి పనిలో ప్రాణముంటుంది..ప్రతి ప్రాణానికీ ఒక కథుంటుంది..ఈ కథ ఎవరు చెప్పాలని రాసుందో, ఈ రామాయణానికి వాల్మీకి ఎవరో ఇప్పుడు తెలిసింది. నా నూరవ చిత్రాన్ని చరితగా మలచిన ‘క్రిష్ జాగర్లమూడి', ఈ చరిత్రకు చిత్ర రూపాన్నిస్తున్నారని ఆనందంతో తెలియజేస్తున్నాను.... అని బాలయ్య తెలిపారు. <br />ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం... ఇది మా కలయికలో రెండవ దృశ్యకావ్యం. మరో అఖండ విజయానికి అంకురార్పణం..నాన్నగారి ఆత్మ ఆశీర్వదిస్తుంది. మీ అందరి అభిమానం మమ్మల్ని నడిపిస్తుంది... అని బాలయ్య తెలిపారు.

Buy Now on CodeCanyon